Telugu Gateway
Andhra Pradesh

లోకేష్ ఓడిపోయాక ఇంకా రిఫరెండం ఎందుకు?

లోకేష్ ఓడిపోయాక ఇంకా రిఫరెండం ఎందుకు?
X

తెలుగుదేశం పార్టీపై వైసీపీ అధికార ప్రతినిధి సీ. రామచంద్రయ్య తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తాను అధికారంలో ఉండగా ఎన్నిసార్లు రిఫరెండం పెట్టారని ప్రశ్నించారు. నారా లోకేష్ ఓటమి పాలయ్యాక ఇంకా రెఫరెండం కావాలా? అని ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం నాడు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సొంత ప్రయోజనాలకోసమే అమరావతిపై కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారని విమర్శించారు. రాజధాని అంశంపై చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలనే రూల్‌ ఉందా..? అని ప్రశ్నించారు. రాజధానిపై రాష్ట్రానిదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసిందని, చంద్రబాబు అండ్ కో చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని పేర్కొన్నారు.

‘రాజధాని రైతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలుగా ఆదుకుంటారు. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. రైతులకు సీఎం రెండు ఆఫ్షన్లు ఇచ్చారు. ఒకటి అభివృద్ధి చేయడం. రెండు వారి భూముల వారికి తిరిగి ఇవ్వడం. చంద్రబాబు తన వారికోసమే ఉద్యమం చేయిస్తున్నాడు. కొంత మంది పెయిడ్ లీడర్లను తయారుచేసి తిప్పుతున్నాడు. చంద్రబాబు మాటలు విని రైతులు మోసపోవద్దు. ఇప్పటికైనా రాజధాని రైతులు దీక్ష విరమించాలి. చంద్రబాబు చేసిన అవినీతికి తప్పకుండా జైలుకు వెళ్తారు. బీజేపీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పంపినా జైలుకు వెళ్లడం తప్పదన్నారు.

Next Story
Share it