Telugu Gateway
Cinema

‘సమ్మర్’లో సందడి చేయనున్న పవన్

‘సమ్మర్’లో సందడి చేయనున్న పవన్
X

పవన్ కళ్యాణ్ ఈ ‘సమ్మర్’లోనే సందడి చేయనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నటించిన సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాత ‘దిల్ రాజు’ వెల్లడించారు. మే 15న పవన్ కళ్యాణ్ నటించిన ‘పింక్’ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే హిందీ సినిమా పింక్ కు ఇది రీమేక్ అయినా అసలు సినిమాకు..తెలుగు సినిమా మధ్య వ్యత్యసం చాలా ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను చూస్తారన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా వరస పెట్టి మూడు సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే.

ఒకటి పింక్ రీమేక్ కాగా..మరోకటి క్రిష్ దర్శకత్వంలో రానుంది. మూడవ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రానుంది. ఉగాది సందర్భంగా పింక్ రీమేక్ టైటల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం తాము జాను సినిమా ప్రమోషన్ల పనిలో బిజీగా ఉన్నామని..ఇది కాగానే ‘వి’ సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయని..అది పూర్తికాగానే పింక్ సినిమాపై మరింత దృష్టి పెడతామని వెల్లడించారు.

Next Story
Share it