Telugu Gateway
Politics

ఢిల్లీలో ఆప్ కు 62సీట్లు..బిజెపికి 8

ఢిల్లీలో ఆప్ కు 62సీట్లు..బిజెపికి 8
X

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఎగ్జాట్ ఫలితాలుగా తేలాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీని క్లీన్ స్వీప్ చేసింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 62 సీట్లు గెలుచుకుని తన సత్తాను చాటింది. అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేసిన బిజెపి కేవలం ఎనిమిది సీట్లతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి. అన్ని చోట్ల చేసిన తరహాలోనే ఢిల్లీలోనూ బిజెపి తన మార్కు రాజకీయం చేయగా..అది ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. కేజ్రీవాల్ ను రెచ్చగొట్టేందుకు బిజెపి ఎంతగా ప్రయత్నించినా ఆయన మాత్రం ఆ ట్రాప్ లో పడకుండా తన మార్గంలో తాను వెళ్ళి విజయం సాధించారు. అరవింద్ కేజ్రీవాల్ ఫోకస్ అంతా తాను చేసిన అభివృద్ధి పనులపైనే ఫోకస్ పెట్టారు. ఎప్పుడూ కూడా చర్చ పక్కదారి పట్టకుండా చూసుకున్నారు. అందుకే బిజెపి నేతలు ఏకంగా సీఎం కేజ్రీవాల్ ను తీవ్రవాది అంటూ వ్యాఖ్యానించినా ఆయన పెద్దగా దీనిపై యాగీ చేయలేదు. ఢిల్లీ ప్రజలే దీనిపై నిర్ణయం తీసుకుంటారంటూ..తాను తీవ్రవాదిని అయితే ప్రజలు బిజెపికి ఓట్లు వేస్తారని వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆప్ మంచి మెజారిటీతో దూసుకెళ్లింది.

ఓ దశలో బిజెపికి డబుల్ డిజిట్ ఫలితాలు వచ్చేలా కన్పించినా చివరకు మాత్రం ఆ పార్టీ కేవలం ఎనిిమిది సీట్లతో సింగిల్ డిజిట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా దక్కిన ఫలితంతో కేజ్రీవాల్ హ్యాట్రిక్ విజయం సాధించినట్లు అయింది. ఫలితాల వెల్లడి అనంతరం కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తల నుద్దేశించి మాట్లాడారు. ఢిల్లీ ప్రజలు తనను కొడుకుగా భావించి ఓట్లేశారని వ్యాఖ్యానించారు. ఇది తన విజయం కాదని..ఢిల్లీ ప్రజల విజయం అని వ్యాఖ్యానించారు. ఢిల్లీప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు. ఢిల్లీలో పని రాజకీయం పురుడు పోసుకుందని అన్నారు. సామాన్యుడి కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు, విద్యుత్, నీటిసరఫరా, పౌరసేవలే తమను గెలిపించాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు ఇఛ్చిన తీర్పుతో మరో ఐదేళ్ళు కష్టపడి పనిచేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. మరో పార్టీ కాంగ్రెస్ ఢి్ల్లీలో పత్తా లేకుండా పోయింది.

Next Story
Share it