Telugu Gateway
Andhra Pradesh

జగన్ వడ్డీతో సహా చెల్లించే రోజు దగ్గర్లోనే ఉంది

జగన్ వడ్డీతో సహా చెల్లించే రోజు దగ్గర్లోనే ఉంది
X

వైసీపీ ప్రభుత్వం చేస్తున్నట్లు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే జగన్ అసలు బయట తిరిగేవాడా అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బోస్టన్ కమిటీ భోగస్ కమిటీ అని ఆరోపించారు. కావాలనే అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విశాఖపట్నంలో బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని విమర్శించారు. తెనాలిలో అమరావతి జెఏసీ నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే..వైసీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. జై అమరావతి అంటే విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నారని చెప్పారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు, 37 మంది చనిపోయారు... ఇవన్నీ ప్రభుత్వ హత్యలే..ఇంకెంత మందిని బలి తీసుకుంటారు? అని ప్రశ్నించారు. రాజధానిపై వైసీపీ ఎంపీని నిలదీశారని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని అన్నారు. జగన్‌ వడ్డీతో సహ చెల్లించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు..చిల్లర రౌడీలు జేఏసీ టెంట్ కాల్చుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.

‘‘ప్రజావేదిక కూల్చి జగన్ విధ్వంసానికి శ్రీకారం చుట్టారు. నేను పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. జగన్‌..నయా తుగ్లక్‌. ఓ వ్యక్తిపై కోపంతో రాజధాని మార్చడం సరికాదని జాతీయ మీడియా అంతా ఖండించింది. మన తుగ్లక్‌కు ఇంకా జ్ఞనోదయం కాలేదు. వైసీపీ ఎమ్మెల్యేలకు సామాజిక స్పృహ లేదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.విశాఖపట్నం రూపురేఖలు మార్చిన ఘనత తనదే అన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ సభలు..సమావేశాలకు అనుమతులు వస్తాయి కానీ..టీడీపీ సభలను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Next Story
Share it