Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

చంద్రబాబు, లోకేష్ లే అత్యంత అవినీతిపరులు

0

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటనపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు హవాలా లావాదేవీల విషయంలో  ఐటి శాఖ నోటీసులు జారీ చేయటంతోనే ఈ కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. చంద్రబాబు, నారా లోకేష్ లే అత్యంత అవినీతిపరులు అని విమర్శించారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని.. హడావుడిగా ఆస్తులను ప్రకటించడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఆయన గురువారం  తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రకటించిన ఆస్తులన్నీ డుప్లికేటేనని, ఐటీ విచారణలో నిజాలు బయటపడుతున్నాయనే కారణంతో ఆస్తులు ప్రకటించారని విమర్శించారు. ‘చంద్రబాబు పీఎస్‌ ఇంట్లోనే దాడులు చేస్తే.. రూ.2వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయి. ఏడు  లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న ఆయన బినామీ ఆస్తులు బయటపెట్టాలి’ అని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  అమరావతి నుంచి అహ్మద్‌ పటేల్‌ వరకు జరిగిన హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

- Advertisement -

2019 ఎన్నికల్లో చంద్రబాబు.. కాంగ్రెస్‌కు ఎంత కప్పం కట్టారో బయటపడుతోందన్నారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి, కేసుల కోసమే చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు చేసిన అవినీతికి దేవుడు కూడా కాపాడలేడు. భవిష్యత్తులో చంద్రబాబు జైలుకెళ్లక తప్పదు. రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ఒక మాఫియాను సృష్టించారు. ప్రతి నెలా రూ.5కోట్లు పెట్టి మాఫియాను నడిపిస్తున్నారని’ శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే ఆ మాఫియా వివరాలు బయటపెడతామని ఆయన పేర్కొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబును ఎల్లో మీడియా కాపాడుతుందని ధ్వజమెత్తారు. చంద్రబాబుది జనచైతన్య యాత్ర కాదని.. బినామీలను కాపాడుకునే యాత్ర అని ఎద్దేవా చేశారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.