దుమ్మురేపుతున్న ‘భీష్మ’ కలెక్షన్లు
BY Telugu Gateway22 Feb 2020 5:58 PM IST
X
Telugu Gateway22 Feb 2020 5:58 PM IST
నితిన్, రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ సినిమా కలెక్షన్లు కుమ్మేస్తోంది. ఫస్ట్ షో నుంచి సినిమాకు పాజిటివ్ రావటంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ కుషీకుషీగా ఉంది. తొలి రోజు ఈ సినిమాకు 6.28 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు సమాచారం. తొలి రోజు నైజాంలో 2.20 కోట్లు, సీడెడ్ లో 0,80 కోట్లు, వైజాగ్ లో0.62 కోట్లు, గుంటూరులో0.77 కోట్లు,ఈస్ట్ లో0.66 కోట్లు, వెస్ట్ లో 0.56 కోట్లు, కృష్ణాలో0.40 కోట్లు, నెల్లూరులో 0.27 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఆర్గానిక్ వ్యవసాయం అనే సబ్జెక్ట్ ను ఎంచుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా తెరకెక్కించటంలో విజయం సాధించారు.
Next Story