Telugu Gateway
Cinema

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అనుష్క

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అనుష్క
X

అనుష్క శెట్టి. ఒకప్పుడు టాలీవుడ్ లో దుమ్మురేపిన హీరోయిన్. ప్రస్తుతం ఆమె జోష్ తగ్గిందనే చెప్పాలి. కాకపోతే అప్పుడప్పుడూ అలా మెరుస్తూనే ఉంది. భాగమతి తర్వాత అనుష్క కొత్త సినిమా ఏదీ రాలేదు. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బహుశా అనుష్క పెళ్లిపై వచ్చినన్ని వార్తలు మరెవరిపైనా వచ్చి ఉండవేమో. తాజాగా ఈ స్వీటి భామ తన పెళ్ళిపై క్లారిటీ ఇఛ్చేసింది. తల్లిదండ్రులు చూపించిన వాడినే పెళ్ళి చేసుకుంటానని స్పష్టం చేసింది.

తానెవరితోనూ లవ్ లో లేనని..తల్లిదండ్రుల నిర్ణయమే ఫైనల్ అని తేల్చేసింది. దీంతో ఆమె ప్రేమ వార్తలు పుట్టించేవారికి బ్రేక్ పడినట్లే. ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. వీటిని ఇద్దరూ ఖండించారు. అయినా వాటికి బ్రేక్ పడలేదు. అయతే లేని ప్రేమ గురించి పదే పదే వార్తలు రాయటం బాధకు గురిచేస్తుందని అనుష్క వాపోయింది. మరి ఇప్పటికైనా వాటికి బ్రేక్ పడతాయని ఆశిద్దాం.

Next Story
Share it