Telugu Gateway
Cinema

విజయ్ కు జోడీగా వచ్చిన బాలీవుడ్ బామ

విజయ్ కు జోడీగా వచ్చిన బాలీవుడ్ బామ
X

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ భామ అనన్య పాండే వచ్చేసింది. ఆమె తమ టీమ్ లో జాయిన్ అయిన విషయాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయటం ద్వారా చెప్పేశారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, చార్మి కౌర్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో విజయ్ కు జోడీగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అని ప్రచారంలోకి వచ్చింది. కానీ అనన్య పాండే ఎంట్రీ ఇచ్చేసింది. విజయ్ తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయిందనే చెప్పాలి.

Next Story
Share it