Telugu Gateway
Politics

మళ్ళీ నేనే గెలుస్తా

మళ్ళీ నేనే గెలుస్తా
X

ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట. గత ఎన్నికల్లో అమెరికాలో రిపబ్లికన్లకు స్పష్టమైన ఆదిక్యం రావటంతోనే సంస్కరణలకు అవకాశం దక్కిందని తెలిపారు. ఒబామా కేర్ ను మించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం తెచ్చామన్నారు. సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్ధిక వ్యవస్థ పురోగమనంలోకి వస్తుందని అన్నారు. తాను గెలిస్తే మార్కెట్లు మరింత పుంజుకుంటాయని తెలిపారు. తాను ఓడిపోతే మార్కెట్లు పడిపోతాయని వ్యాఖ్యానించారు. రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ట్రంప్, భారత ప్రధాని మోడీల మధ్య అత్యంత కీలకమైన సమావేశం మంగళవారం నాడే జరిగింది. ట్రంప్, మోడీ ద్వైపాక్షిక చర్చల అనంతరం ట్రంప్ ఢిల్లీలోని అమెరికా భారత రాయభార కార్యాలయంలో ధేశంలోని కంపెనీల సీఈవోలు, ఇతర ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురి నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అనంద్ మహీంద్రా, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా తదితరులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు.

భారత్ తో వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయని, దీనికి అంటే చట్టపరమైన అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. భారత్ తో మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒఫ్పందాలు ఖరారైనట్లు ట్రంప్ ప్రకటించారు. అందులో భాగంగా అపాచీ, ఎంహెచ్ 60 రోమియో వంటి అధునాతన హెలికాప్టర్లను అందజేయనున్నట్లు తెలిపారు. దీంతో ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. మరో ఆరేడు నెలల్లో ఒప్పందం రూపుదాల్చనుందని ట్రంప్ వెల్లడించారు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం తన జీవితంలో గొప్ప విషయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన తాజ్‌మహల్‌ను సందర్శించడం గొప్ప అనుభూతి కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను భారత గడ్డపై నుంచి ట్రంప్‌ హెచ్చరించారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తున్నామని... అతివాద ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారత్‌- అమెరికా సంబంధాలు బలపడ్డాయన్న అగ్రరాజ్య అధ్యక్షుడు.. ఢిల్లీలో ఐరాస డెవలప్‌మెంట్‌ ఫండ్‌ శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని తెలిపారు.

ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ గడిచిన ఎనిమిది నెలల్లో ట్రంప్‌తో తనకిది ఐదో భేటీ అని ప్రధాని తెలిపారు. భారత్‌-అమెరికా మైత్రి 21వ శతాబ్దంలోనే కీలక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ట్రంప్‌ తాజా పర్యటన ఇరు దేశాల సబందౠలను మరింత బలోపేతం చేసిందన్నారు. తమ సమావేశాల్లో రక్షణ, భద్రత, టెక్నాలజీపై చర్చించామని మోదీ తెలిపారు. అత్యాధునిక రక్షణ, భద్రత, టెక్నాలజీపై చర్చించామని పేర్కొన్నారు. అత్యాధునిక రక్షణ ఉత్పత్తి సంస్థలు భారత్‌కు వస్తున్నాయని తెలిపారు. భారత రక్షణ వ్యవస్థలో ఈ సంస్థలు భాగస్వామ్యమవుతున్నాయని అన్నారు. సైనిక శిక్షణలో ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని గుర్తు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల ఆర్థిక మంత్రుల మధ్య ఒక అవగాన కుదిరిందని చెప్పారు. అమెరికాతో ఓ భారీ ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నామని ప్రధాని వెల్లడించారు. అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు, ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలలో కీలక పాత్ర పోషిస్తున్నారి ఆనందం వ్యక్తం చేశారు. ‘అంతర్గత భద్రతపై ఒకరికొకరు సహకరించుకుంటున్నాం. మాదక ద్రవ్యాలు, నార్కో టెర్రరిజంపై ఉమ్మడిగా ఉక్కుపాదం. మానవ అక్రమ రవాణాపై రెండు దేశాలు ఉమ్మడిగా పోరాటం. రెండుదేశాల మధ్య ఇటీవల 20 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం. ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారికి వ్యతిరేకంగా రెండు దేశాల పోరాటం. ఆర్థిక సంబంధాల్లో పారదర్శక వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాం. అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన రెండు దేశాలకు కీలకం.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it