Telugu Gateway
Andhra Pradesh

బడ్జెట్ సెషన్స్ తర్వాత వైజాగ్ నుంచి పాలన

బడ్జెట్ సెషన్స్ తర్వాత వైజాగ్ నుంచి పాలన
X

ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వైజాగ్ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా వైజాగ్ నుంచి పాలన ప్రారంభం కావొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి ఎక్కడ నుంచి అయినా పరిపాలించే అధికారం ఉందని అన్నారు. అయినా సరే తాము అన్ని నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రాజధాని వికేంద్రీకరణ ద్వారా మంచి నిర్ణయం తీసుకున్నారని..దీనికి ప్రజల నుంచి మంచి మద్దతు వస్తోందని తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణకు చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని..కోర్టు క్లియరెన్స్ రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే చట్టసవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఓ వైపు రాజధాని తరలింపుపై కోర్టులో కేసు నడుస్తోంది..మరో వైపు మండలిలో సెలక్ట్ కమిటీ బిల్లు వివాదం సాగుతున్న తరుణంలో మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సాధ్యమైనంత త్వరగా విశాఖపట్నం నుంచే పాలన సాగించేందుకు ఆసక్తిచూపుతున్నారనే విషయం పలుమార్లు వెల్లడైంది.

Next Story
Share it