Telugu Gateway
Cinema

రష్మిక స్టెప్పులు అదిరాయి

రష్మిక స్టెప్పులు అదిరాయి
X

టాలీవుడ్ లో దూసుకొస్తున్న హీరోయిన్ రష్మిక మందన. టాప్ హీరోలు అందరితో సినిమాలు చేస్తూ తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఉంది. రష్మిక, నితిన్ జంటగా చేస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమాకు సంబంధించిన ‘వాటే వాటే బ్యూటీ..నువ్వు యాడ ఉంటే ఆడ్నే ఊటీ’ అనే పాటకు సంబంధించిన ప్రొమో వీడియోను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఇందులో హీరో నితిన్ కంటే రష్మిక మందన డ్యాన్స్..స్టెప్పుల్లో అదరగొట్టింది. ఈ పాటకు సంబంధించి పూర్తి లిరికల్ వీడియో ఫిబ్రవరి 2న విడుదల కానుంది.

ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ పాటలో హీరో నితిన్, రష్మిక జోడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా రష్మిక హీరోయిన్ గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘అర్ధమవుతుందా’ డైలాగ్ ను ప్రత్యేక మేనరిజంతో చెప్పి ఆకట్టుకుంది. ఇప్పుడు మరి భీష్మలో ఎన్ని ప్రత్యేకతలు చూపిస్తుందో వేచిచూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=XF1RW-chvK0

Next Story
Share it