రవితేజ ‘క్రాక్’ ఫస్ట్ లుక్ విడుదల
కొత్త సంవత్సరం కొత్త లుక్స్. ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలతోపాటు కొత్త సినిమాలకు సంబంధించి న్యూలుక్స్ తో కూడిన చిత్రాలను ఆయా సినిమాల యూనిట్లు విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘క్రాక్’ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. సోడా బాటిల్ పట్టుకొని పోలీసు ఆఫీసర్‌గా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న రవితేజ లుక్ ప్రేక్షకులను అలరిస్తోంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఇంతకుముందు డాన్‌శీను, బలుపు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం క్రాక్.
ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రవితేజకు జోడీగా శృతిహాసన్ కన్పించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌పాత్రల్లో నటిస్తున్నారు.