Telugu Gateway
Andhra Pradesh

మంత్రులు..ఎమ్మెల్యేలను డమ్మీలు చేసిన జగన్

మంత్రులు..ఎమ్మెల్యేలను డమ్మీలు చేసిన జగన్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ‘నియంతలా’ వ్యవహరిస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలను డమ్మీలు చేశారని ఆరోపించారు. సలహాదారులు పెద్ద సంఖ్యలో ఉన్నా..ఆయన పక్కన మాత్రం ఒకరిద్దరు మాత్రమే కనపడుతున్నారని ఎధ్దేవా చేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి పంపటం వల్ల వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. సెలక్ట్ కమిటీ ప్రజాభిప్రాయం సేకరిస్తుందని..ఇందులో తప్పేముందని అన్నారు. జగన్ కు అసలు అమరావతి అంటే మంటగా ఉందని..ఎందుకంత కసి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో అన్ని రంగాల నిపుణులు ఉన్నారని జగన్ చెబుతున్నారని..అలాగే నేరస్తుల జాబితా కూడా చెపితే బాగుండేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఏ మాత్రం నిబంధనలు పాటించని సర్కారు మండలిలో విషయాన్ని మాత్రం భూతద్దంలో చూపిస్తోందని విమర్శించారు. సీఎం జగన్ టీడీపీ సభ్యులను బయటకు పంపించమని ఆదేశిస్తారు.

స్పీకర్ మార్షల్స్ ను పిలిచి సీట్లలో కూర్చోబెట్టాలని..బయటకు పంపాలని చెబుతారని..ఇదెక్కడి పద్దతి అని ప్రశ్నించారు. సభ్యులు ఎవరైనా గొడవ చేస్తే సస్పెండ్ చేసి మార్షల్స్ ద్వారా బయటకు పంపాలి కానీ ఇష్టానుసారం చేయటం సరికాదన్నారు. శాసన మండలి నిర్వహణకు ఏటా 60 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని రద్దు చేస్తామని చెబుతున్న సర్కారు..150 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అసెంబ్లీని కూడా రద్దు చేస్తారా? అని యనమల ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి...చంద్రబాబును కూడా కోర్టుకు పంపించాలనుకుంటే కుదరదని యనమల అన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చర్చలు చేస్తున్నారని, శాసనసభ అంటే వాళ్ళకి మార్కెట్‌లా ఉందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఎక్కడో అనంతపురం వాళ్లు అమరావతిలో స్థలం ఎందుకు కొన్నారని ప్రశ్నిస్తున్నారని..మరి జగన్ ఎక్కడో బెంగుళూరులో ఎందుకు ప్యాలెస్ కట్టుకున్నారని ప్రశ్నించారు. ‘‘గుట్కాలు నమిలే వాళ్ళు..తాగి వచ్చిన వాళ్ళు కౌన్సిల్‌కు వచ్చారు..కొందరు భుజాలు తడుముకుంటున్నారు.. లోకేష్‌ని కొట్టడానికి మంత్రులు ప్రయత్నించారు.. మండలి చైర్మన్‌పై దాడి చేయడానికి కూడా చూశారు.. మేము కాదు..మీ లాంటి వాళ్ళు సభల్లో ఉండకూడదు. మనీ లాండ రింగ్ కేసులో జగన్‌కు శిక్ష పడుతుందని యనమల వ్యాఖ్యానించారు.

Next Story
Share it