Telugu Gateway
Politics

కెటీఆర్ సమర్ధుడు..రాహుల్..లోకేష్ లా కాదు

కెటీఆర్ సమర్ధుడు..రాహుల్..లోకేష్ లా కాదు
X

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కెసీఆర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు కెటీఆర్ సీఎం అవుతారని అన్నారు. కెటీఆర్ అన్ని రకాలుగా సమర్ధుడు అన్నారు. అటు పార్టీని..ఇటు ప్రభుత్వంలోనూ సమర్ధవంతంగా పనిచేసుకుంటూ వెళుతున్నారన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్, సోనియాగాంధీ కొడుకు రాహుల్ గాంధీలా కెటీఆర్ అసమర్ధుడు కాదన్నారు. మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలున్నాయని వ్యాఖ్యానించారు. ఆయన నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు.

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నెహ్రూ కుటుంబం ప్రభుత్వాన్ని నడపలేదా, రాష్ట్రం సాధించిన కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించొద్దు అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి లు రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా అంతే చేస్తున్నాయని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని..కాంగ్రెస్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంటుందని తెలిపారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు కోర్టుకు పోవటం, ఓటమి తర్వాత కుంటిసాకులు చెప్పటం ఆ పార్టీలకు అలవాటే అని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.

Next Story
Share it