Telugu Gateway
Andhra Pradesh

పది మంది ఉన్నారు..రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు

పది మంది ఉన్నారు..రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం పక్కకు చేరి జై అమరావతి...జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రైతు భరోసా కేంద్రాల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో కూడా టీడీపీ నినాదాలు కొనసాగాయి. మధ్యలో మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకుని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మరోసారి విమర్శలు చేశారు. చంద్రబాబు ఏదో ఒక గొడవ చేసి బయటకు వెళ్లి జోలె పట్టి అడుక్కోవాలని చూస్తున్నారని..అందుకే అసెంబ్లీలో గొడవ సృష్టిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. మొన్న అసెంబ్లీ మెట్ల మీద కూర్చున్నప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు తనకు చెపితే..తాను చిల్లర వేస్తే వెళ్లిపోతాడని చెప్పానని అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబును విశాఖ ప్రజలు మూడుసార్లు గెలిపించినా ఆయన గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ అమరావతిలోనే రాజధాని కావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. కొడాలి నాని వ్యాఖ్యలతో టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి నిరసనను పెంచారు. ఓ దశలో అధికార పార్టీ సభ్యులు అందరూ పోడియం దగ్గరకు వెళ్లటంతో ఒక్కసారిగా సభలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

అసలు ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. ఈ దశలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. సీఎం వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘పది మంది ఉన్నారు. రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు. రౌడీలన్నా బెటర్. వీధి రౌడీలను ఏరివేసే కార్యక్రమం చేపట్టకపోతే వ్యవస్థ బాగుపడదు. అసెంబ్లీ పోడియం దగ్గర ఓ రింగ్ పెట్టండి. అక్కడకి ఎవరైనా వస్తే మార్షల్స్ తో తీసుకెళ్లి బయటపడేయండి. లేకపోతే ప్రజామస్యలపై సభలో చర్చ జరిగే ఛాన్స్ రాదు. ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. కనీసం పది మంది లేరు. పోడియం పైకి ఎక్కి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. మా వాళ్లు రెచ్చిపోకుండా ఉంటారా?. ఎవరైనా రెచ్చిపోయి దాడి చేస్తే తమకు అనుకూల మీడియాలో మళ్లీ వక్రీకరించి వార్తలు రాయిస్తారు. ఎంత దుర్మార్గం అధ్యక్షా..తక్షణమే మార్షల్స్ ను పిలిపించండి. చేతనైతే సలహాలు ఇవ్వాలి. లేకపోతే సభకు రాకుండా ఉండాలి.’ అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it