Top
Telugu Gateway

జగన్ ది పైశాచిక ఆనందం

జగన్ ది పైశాచిక ఆనందం
X

సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు బుధవారం నాడు తీవ్ర విమర్శలు చేశారు. రాజధానికి భూములు ఇఛ్చిన రైతులతోపాటు ప్రజలందరినీ భాద పెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అమరావతిలో భార్య భువనేశ్వరి, బ్రాహ్మణీ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని కోసం ఎవరూ ప్రాణత్యాగాలు చేయొద్దని...పోరాడి సాదిద్ధామని అన్నారు. సీఎం వైఎస్ జగన్...త్యాగాన్ని కూడా గుర్తించలేని మూర్ఖుడని విమర్శించారు. ఈ సంవత్సరం కష్టాల సంక్రాంతి’ అని వ్యాఖ్యానించారు. ప్రతి సంక్రాంతికి నారావారిపల్లెకు వెళ్లేవాళ్లమని...ఈ సారి సంక్రాంతి జరుపుకోవడం లేదని బాబు తెలిపారు.

అమరావతి కేవలం 29 గ్రామాల సమస్య కాదని..ఇది 5 కోట్ల మంది ఏపీ ప్రజల సమస్యన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలో శివరామకృష్ణ కమిటీ చెప్పిందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారని...భూములు ఇచ్చిన వాళ్లలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు. విశాఖ ప్రజలు రాజధాని అడగలేదని, అభివృద్ధి కోరుకున్నారని తెలిపారు. సీమ వాసులకు విశాఖ వెళ్లాలంటే చాలా దూరం అవుతుందని అన్నారు. వరదలు వస్తాయని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని అసత్యాలు చెప్పారని చంద్రబాబు మండిపడ్డారు.

Next Story
Share it