Telugu Gateway
Andhra Pradesh

అక్రమాస్తుల కేసు..హైకోర్టులో జగన్ పిటీషన్

అక్రమాస్తుల కేసు..హైకోర్టులో జగన్ పిటీషన్
X

సీబీఐ కోర్టు ఆదేశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో తన బదులు మరొకరిని వారం వారం కోర్టుకు పంపుతానని...తాను సీఎంగా ఉన్నందున పని ఒత్తిడి ఉంటుంది కాబట్టి మినహాయింపు ఇవ్వాలని కోరగా..అందుకు సీబీఐ కోర్టు నో చెప్పిన సంగతి తెలిసిందే. తొలుత సీబీఐ కేసుల్లో హాజరు తప్పని సరి అని చెప్పిన సీబీఐ కోర్టు తాజాగా ఈడీ కేసుల్లోనూ అలాంటి ఆదేశాలే జారీ చేసింది. అంతే కాకుండా తదుపరి వాయిదా అయిన జనవరి 31న హాజరు కాకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.

ఈ తరుణంలో సీబీఐ కోర్టు ఆదేశాలపై జగన్ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తనకు హాజరు విషయంలో మినహాయింపు ఇవ్వకపోవటాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయన్న కారణంగా హాజరు మినహాయింపు నిరాకరించడం సరికాదన్న జగన్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉందని ..అందుకే వ్యక్తిగత హాజరుపై మినహాయింపు కోరుతున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది.

Next Story
Share it