Telugu Gateway
Politics

నర్సులు..అప్సరసలు

నర్సులు..అప్సరసలు
X

ఆయన ఓ దేశ ప్రధాని. కానీ మాటలు మాత్రం చాలా చౌకబారుగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ఇఫ్పుడు మరోసారి ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరే వారికి సేవలదించే నర్సులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రధాని ఎవరు అనుకుంటున్నారా?. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అయితే ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ‘ఆ డాక్టరు ఏ ఇంజెక్షన్ ఇచ్చారో కానీ ఆ మందు శరీరంలోకి వెళ్లగానే నా చుట్టూ ఉన్న నర్సులు అందగత్తెల్లా..అప్సరసల్లా కనిపించారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా పాక్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ప్రసంగిస్తూ.. 2013 ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేజి కూలి నేను గాయపడ్డాను. ఆ సమయంలో నన్ను షౌకత్ ఖానుమ్ ఆస్పత్రికి తరలించారు. అప్పుడు డాక్టర్ అసీమ్ నాకు ముందుగా ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్‌లోని మందు శరీరంలోకి వెళ్ళగానే నా నొప్పి పోయింది. అప్పుడు నా చుట్టూ ఉన్న నర్సులు నాకు అప్సరసల్లా కనిపించారని ఇమ్రాన్ అన్నారు. వారు అలా ముందు నిలబడితే నొప్పి అస్సలు అనిపించేది కాదని వారి అందం గురించి ప్రధాని పొగిడారు.

Next Story
Share it