Telugu Gateway
Cinema

అదరగొడుతున్న ‘నాని ఫస్ట్ లుక్’

అదరగొడుతున్న ‘నాని ఫస్ట్ లుక్’
X

ఆ టైటిలే వెరైటీగా ఉంది. ‘వి’ సినిమాతో వస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఇందులో నాని లుక్ మాత్రం అదరగొడుతోంది. రఫ్ గా గడ్డం..మీసాలు పెంచిన ఈ హీరో చేతిలో చిన్న కత్తెర పట్టుకుని స్టైలిష్ గా కన్పిస్తున్నాడు. మరో వైపు చేతి నుంచి రక్తం కారుతున్న విషయం కూడా కనపడుతుంది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో అదితిరావు హైదరి, నివేదా థామస్‌ హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. నానితో కలసి పలు హిట్ సినిమాలు తెరకెక్కించిన మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శక​త్వం వహిస్తున్నారు. తన 25వ చిత్రంలో నేచరల్‌ స్టార్‌ రాక్షసుడుగా కనిపించనున్నారని చిత్ర యూనిట్‌ ఇదివరకే ప్రకటించింది.

ఇప్పటికే విడుదలైన సుధీర్‌ బాబు రక్షకుడుకి సంబంధించిన లుక్‌ నెటిజన్లను ఆకట్టుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా నాని లుక్‌ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించారు. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it