Telugu Gateway
Cinema

‘దర్బార్’ మూవీ రివ్యూ

‘దర్బార్’ మూవీ రివ్యూ
X

రజనీకాంత్ సినిమాలు అంటే ఆ క్రేజే వేరు. రజనీ సినిమాల కోసం ఆయన అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తారు. కాకపోతే గత కొంత కాలంగా రజనీకాంత్ కు కూడా బ్లాక్ బస్టర్ వంటి సినిమాలు లేవనే చెప్పుకోవాలి. రజనీ ఎన్నో ఆశలు పెట్టుకున్న 2.ఓ సినిమా ప్రేక్షకులను కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలకు తోడు ‘దర్బార్’ కూడా రంగంలో నిలిచింది. ఈ సినిమా గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ వైపు సంచలన దర్శకుడు మురుగదాస్, మరో వైపు రజనీకాంత్, తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాలు నమోదు చేసుకుంటున్న హీరోయిన్ నయనతార. నివేదా థామస్. ఇక అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘దర్బార్’ ఆకట్టుకుందా చూద్దాం.

ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోయినా ఫస్టాఫ్ మాత్రం దర్శకుడు మురుగదాస్ చాలా గ్రిప్పింగ్ గా నడిపించారు. సెకండ్ హాఫ్ స్లోగా, క్లైమాక్స్ రొటీన్ గా ఉంది. అనిరుధ్ ఆర్ ఆర్ బాగుంది కానీ పాటలు తెలుగుకి సూట్ కాలేదనే చెప్పొచ్చు. ఇక అసలు కథ విషయానికి వస్తే ముంబయ్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఆదిత్య అరుణాచ‌లం(ర‌జినీకాంత్‌), గ్యాంగ్‌స్ట‌ర్స్‌ ను ఎన్‌కౌంట‌ర్ చేస్తుంటాడు. ఒక‌ రోజులోనే 13 మందిని ఎన్‌కౌంట‌ర్ చేస్తాడు. దీంతో ముంబైలోని దాదాలంద‌రూ భ‌య‌ప‌డిపోతుంటారు. ఆదిత్య అరుణాచ‌లం చివరకు మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను కూడా లెక్క చేయ‌డు. అక్క‌డ నుండి క‌థ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఆదిత్య ఢిల్లీ నుండి ముంబయ్ కి స్పెష‌ల్ ఆర్డ‌ర్ మీద వ‌స్తాడు. హ‌రి చోప్రా(సునీల్ శెట్టి) కార‌ణంగా ముంబయ్ పోలీసుల‌ను ఎవ‌రూ లెక్క‌చేయ‌రు. ప్ర‌జ‌ల్లో పోలీసులంటే భ‌యం ఉండ‌దు. ఆ స‌మ‌యంలో ముంబయ్ లో అడుగు పెట్టిన ఆదిత్య‌కు డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ కుమార్తె కిడ్నాప్ గురించి తెలుస్తుంది. ఆమెను క‌నిపెడుతూనే ముంబైలోని డ్ర‌గ్స్, హ్యుమ‌న్ ట్రాఫికింగ్ స‌మ‌స్య‌ను నిర్మూలిస్తాడు.

ఇలాంటి కథలు చాలా సినిమాల్లో చూసినవే. కాకపోతే దర్శకుడు మురుగదాస్ ఫస్టాఫ్ లో తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. రజనీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మురుగ‌దాస్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ తో ద‌ర్బార్ సినిమాను తెర‌కెక్కించారు. ర‌జినీకాంత్ సోలో పెర్ఫామెన్స్‌ తో సినిమాలో అంతా తానై క‌నిపించాడు. హీరోయిన్‌గా చేసిన న‌య‌న‌తార‌, కూతురుగా చేసిన నివేదా థామ‌స్ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. సినిమాలో ర‌జినీకాంత్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ సింప్లీ సూప‌ర్బ్‌. మాస్ ఆడియెన్స్‌ ను ఆక‌ట్టుకునే స్టైల్లో రామ్‌ల‌క్ష్మ‌ణ్ ఫైట్‌ను డిజైన్ చేశారు. న‌వాజ్ షా, ప్ర‌తీక్ బబ్బ‌ర్‌, ర‌జినీకాంత్ మ‌ధ్య న‌డిచే క్యాట్ అండ్ మౌస్ సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. ఓవరాల్ గా చూస్తే దర్బార్ ఓ సారి చూసేయోచ్చు.

రేటింగ్ 2.75/5

Next Story
Share it