Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై జగన్ ఫైర్

టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై జగన్ ఫైర్
X

అసెంబ్లీ వేదికగా టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత హీన చరిత్ర ఉన్న పార్టీ మరొకటి ఉండదని మండిపడ్డారు. ఎస్సీలు అందరూ ఒక్కటిగా ఉండాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం వారిని విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ప్రత్యేక బిల్లుపై జరిగిన చర్చలో జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలను విభజించి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.పోడియం వద్దకు వచ్చి సభకు టీడీపీ ఆటంకం కలిగిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ బిల్లును టీడీపీ అడ్డుకుంటోంది. అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేయకుండా అడ్డుపడుతున్నారు.

అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును మండలిలో​ అడ్డుకుంటున్నారు. బిల్లు పాస్‌ కాకుండా చేసిన హీనమైన చరిత్ర టీడీపీది. సభలో ఏం చేస్తున్నారో టీడీపీకి తెలియడం లేదు. మాల, మాదిగ, రెల్లిలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. చరిత్రలో ఇలా ఎక్కడా జరగలేదు. ఎస్సీలు అందరూ ఒక్కటిగా ఉండాలని మా ప్రయత్నం. ఎస్సీలను విడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్‌ తీసుకొస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలో ఒక చోట టీడీపీ, మరో చోట జనసేన గెలిచింది. మిగిలిన అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలిచింది. జనసేన సభ్యుడు కూడా మా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను మెచ్చుకుంటున్నారుఅని జగన్ తెలిపారు.

Next Story
Share it