ఆకట్టుకుంటున్న ‘భీష్మ’ టీజర్
నితిన్..రష్మిక ఈ జోడీ ‘భీష్మ’ సినిమాకు ఓ ఊపు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్..గ్లింప్స్ ఎంతగానో మెప్పించాయి. ఆదివారం నాడు చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టీజర్ లో 'నీ పేరేంటని హీరో నితిన్‌ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంపత్ అడిగితే.. భీష్మ అంటాడు. అప్పుడు ఆయన భీష్మ కాదు భీష్మ సర్ అనాలి అంటాడు. ఇందుకు నితిన్ స్పందిస్తూ అంటే నా పేరుకి సర్ యాడ్ చేస్తే బాగోదేమో అని వేసిన పంచ్ నవ్వులు పూయిస్తోంది.
ఏం చేస్తుంటావ్ అని అడిగితే.. మీమ్స్ చేస్తుంటానని చెప్తాడు. కానీ రష్మిక దగ్గర మాత్రం ఐఏఎస్, ఏసీపీ అని తిరుగుతుంటాడు. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దబ్బకాయ అంత ఉందండి' అంటూ నితిన్ బాధపడుతూ చెప్తున్న డైలాగ్ నవ్వు వెరైటీగా ఉంది. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=tK78bIE7js8