Telugu Gateway
Andhra Pradesh

కేంద్రం కోర్టులోకి మండలి రద్దు తీర్మానం ప్రతి

కేంద్రం కోర్టులోకి మండలి రద్దు తీర్మానం ప్రతి
X

ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు మండలి రద్దు విషయంలో దూకుడు చూపిస్తోంది. ఈ విషయంలో ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటోంది. సోమవారం సాయంత్రం అసెంబ్లీ మండలి రద్దుకు 133 ఓట్లతో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానం ప్రతిని అన్ని లాంఛనాలు పూర్తి చేసి కేంద్రానికి పంపారు. అసెంబ్లీ నుంచి తీర్మానం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చేరటం..రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలను కేంద్ర హోం, న్యాయ శాఖలకు పంపటం పూర్తి అయింది. దీంతో ఇక మండలి రద్దు బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లినట్లు అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలి రద్దు ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ముగించేసేలా వ్యూహం రచిస్తున్నారు. మరి జగన్ వ్యూహానికి కేంద్రం ఏ మేరకు మద్దతు ఇస్తుంది అన్నది ఇఫ్పుడు కీలకంగా మారింది. ఏపీలో కొత్తగా మూడు రాజధానుల ఏర్పాటు, మండలి రద్దు ప్రతిపాదనలను కూడా వైసీపీ సర్కారు కేంద్రంలోని పెద్దలకు చెప్పే చేస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాష్ట్ర బిజెపి నాయకులు ఈ వార్తలను ఖండిస్తున్నా..దీనిపై పలు అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు నేతలు. మండళ్లకు సంబంధించి పలు ప్రతిపాదనలు ఇఫ్పటికే కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న దశలో వాటన్నింటిని బైపాస్ చేసి కేంద్రం ఏపీ మండలి రద్దు విషయంలో నిర్ణయం తీసుకుంటుందా? లేక అన్నింటి వలే దీన్ని కూడా కోల్ట్ స్టోరేజ్ లో పడేస్తుందా ? అన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతం అయి ఉంది. ఆరు నెలల వ్యవధిలో ఏపీ మండలికి కేంద్రం ఆమోదించినా..ఇది వైసీపీ, బిజెపిల సమ్మతితో సాగిన వ్యవహారం తేలిపోతుందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అన్ని తీర్మానాల వలే దీన్ని కూడా పక్కన పెడితే మాత్రం బిజెపికి ఆ అపప్రద రాదు. మరి ఇందులో ఎన్ని రాజకీయాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it