Telugu Gateway
Cinema

అల..వైకుంఠపురములో..104 కోట్ల షేర్

అల..వైకుంఠపురములో..104 కోట్ల షేర్
X

అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాడు. ఫస్ట్ డే..ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్ళు కూడా అంతే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్ల రూపాయల షేర్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. ఆల్ టైమ్ రికార్డుగా చిత్ర యూనిట్ పేర్కొంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డె నటించిన సంగతి తెలిసిందే.

సినిమాలో పాటలు అన్నింటి కంటే హైలెట్ గా నిలవగా..సినిమాలో కథ పరంగా కంటే అల్లు అర్జున్ యాక్షన్ పై ప్రేక్షకుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో అల..వైకుంఠపురంలో నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా రికార్డులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Next Story
Share it