Telugu Gateway
Cinema

అల వైకుంఠపురములో..పది రోజుల్లో 220 కోట్ల గ్రాస్

అల వైకుంఠపురములో..పది రోజుల్లో 220 కోట్ల గ్రాస్
X

అల్లు అర్జున్ ఆల్ టై రికార్డు నమోదు చేశాడు. అల..వైకుంఠపురములో సినిమా పది రోజుల్లోనే 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళు సాధించింది. ఇది నాన్ బాహుబలి 2 రికార్డుగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పాటల విడుదలతోనే ఈ సినిమా ఓ రకమైన హిట్ ను నమోదు చేసుకుంది. సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. దీంతో వసూళ్లు వర్షం కురిసింది. భారత్ తో పాటు అమెరికాలోనూ ఈ సినిమా వసూళ్లలో సంచలనాలు నమోదు చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డె, మరో కీలక పాత్రలో నివేదా పేతురాజ్ లు నటించారు.

220 కోట్ల రూపాయల గ్రాస్...143 కోట్ల రూపాయల షేర్ ను ఈ చిత్రం సాధించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 112.90 కోట్లు, కర్ణాటకలో 10.70 కోట్లు సాధించినట్లు సమాచారం. విదేశాల్లోనూ ఈ సినిమా కలెక్షన్లు జోరుగా ఉన్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లు ఫుల్ అవుతుండటంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Next Story
Share it