పవన్ పై వైసీపీ నేతల ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి గ్రామాల పర్యటనపై వైసీపీ నేతలు స్పందించారు. పలువురు నేతలు పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అయితే వ్యక్తిగత దూషణలకూ దిగారు. చంద్రబాబు హయాంలో పవన్ నాలుగేళ్లు గోళ్లు గిల్లుకున్నారని.. ముల్లు గుచ్చుకుంటే పారిపోయే వ్యక్తి అని జోగి రమేశ్ విమర్శించారు. రంగులు మార్చుకోవడానికి, వేషాలు మార్చుకోడానికి, సినిమాలకు, ఆఖరుకి పెళ్లాలను మార్చుకోవడానికి పనికొస్తారు తప్ప.. రాజకీయాలకు పవన్ పనికిరాడని దుయ్యబట్టారు.
‘‘రెండు చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవలేని ఈ పిచ్చి తుగ్లక్ మాకు చెబుతాడా.. మా సత్తా మాకేంటో తెలుసు.. 151 మంది ఎమ్మెల్యేలం గెలిచాం.. అవసరమైతే.. 152.. 153 గెలుస్తాం.. అన్ని ప్రాంతాల అభివృద్ధే మా ముఖ్యమంత్రి ధ్యేయం’’ అని తీవ్రస్థాయిలో స్పందించారు. అమరావతి రాజధాని లేదని ఎవరైనా చెప్పారా.. తీసేస్తామని ఎవరైనా చెప్పారా.. అని రమేశ్ ప్రశ్నించారు. సీఎం జగన్ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు పవన్ కళ్యాణ్ పర్యటనపై విమర్శలు గుప్పించారు.