Telugu Gateway
Andhra Pradesh

అభివృద్ధి వికేంద్రీకరణ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది?!

అభివృద్ధి వికేంద్రీకరణ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది?!
X

ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే మంచిదే.ఇందులో ఆక్షేపించాల్సిన అవసరం ఏమీ లేదు. వైసీపీ నేతలకు ఇప్పుడే శివరామకృష్ణ కమిటీ నివేదిక దొరికిందా?. గతంలో వాళ్ళు అసలు ఆ నివేదికే చూడలేదా?. ఐదేళ్ళ తర్వాత అందరూ రాజధాని అమరావతి అని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా ‘అభివృద్ది వికేంద్రీకరణ’ నినాదం అందుకోవటం వెనక మతలబు ఏమిటి?. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పట్టిసీమను గట్టిగా వ్యతిరేకించింది. ఈ డబ్బునే పోలవరం కోసం ఖర్చుపెడితో ఉపయోగంగా ఉంటుందని వాదించింది. పట్టిసీమతోపాటు మరికొన్ని ప్రాజెక్టులను కూడా తప్పుపట్టింది. కానీ ఎప్పుడూ ఐదేళ్లలో రాజధాని అమరావతిలో వద్దని ప్రకటించలేదు. పైగా ఎంతసేపూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపిస్తున్నారని..శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదని విమర్శించింది. ఎద్దేవా చేసింది. అందులో ఏ మాత్రం తప్పులేదు. చంద్రబాబు కట్టలేదని వాదించి..ఇప్పుడు తాము కూడా ఇక్కడ కట్టలేమని చెబుతోంది. అదే వెరైటీ. ప్రతిపక్షంలో ఉండగా ఇదే వైసీపీ అన్నీ అమరావతిలోనే ఎందుకు పెట్టాలి?. ఇప్పుడు ఏది అయితే చెబుతుందో రాయలసీమలో హైకోర్టు పెట్టాలని..వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, అమరావతిలో ఈ తరహా డెవలప్ మెంట్ చేస్తే బాగుంటుందని ఎందుకు సూచించలేదు.

అలా సూచించటానికి చంద్రబాబు ఏమైనా అఖిలపక్షం పెట్టారా? అనే వాదన రావొచ్చు. పట్టిసీమతో పాటు పలు ప్రాజెక్టులను మీడియా వేదికగా...పలు మార్గాల ద్వారా వైసీపీ తన వాయిస్ విన్పించింది. అదే తరహాలో హైదరాబాద్ లో చేసిన పొరపాటు మళ్ళీ ఏపీలో మళ్ళీ జరగొద్దని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తే బాగుంటుందని ఎందుకు వాదించలేదు. అసలు రాజధానికి అంత భూమి ఎందుకు అని వాదిస్తూనే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి 30 వేల ఎకరాలు ఉన్న చోటే రాజధాని పెట్టాలని కోరటం విశేషం. ఇప్పుడు అందుకు భిన్నమైన వైఖరి తీసుకున్నారు. పేరుకే ఇప్పుడే వైసీపీ అభివృద్ధి వికేంద్రీకరణ అని చెబుతున్నా దీని వెనక ‘రాజకీయ కారణాలు’, ఇతర అంశాలే ముఖ్యమనే వాదన విన్పిస్తోంది. ఏడాదిలో కేవలం అరవై రోజుల పాటు జరిగే అసెంబ్లీకే ఈ ప్రాంతాన్ని పరిమితం చేయటంతో ఇక అమరావతి అన్న ప్రాదాన్యత ఏమీ లేకుండా పోతుందనే విషయం తెలిసిందే.

Next Story
Share it