Telugu Gateway
Cinema

‘వెంకీ మామ’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘వెంకీ మామ’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

విక్టరీ వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్ లో వస్తున్న ‘వెంకీమామ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రీల్ లైఫ్ లోనే కాకుండా..రియల్ లైఫ్ లో కూడా వీళ్లిద్దరూ మామా అల్లుళ్ళే అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వాస్తవానికి సంక్రాంతి బరిలో ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు వెంకీమామ డిసెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Next Story
Share it