వైజాగ్ పై టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నంలో సచివాలయం పెడితే రాయలసీమ వాళ్లు ఎలా వెళతారని రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖలు చేశారు. కర్నూలు, అమరావతిలో మినీ సెక్రటేరియట్ లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే మళ్లీ ఉద్యమాలు వస్తాయిని వ్యాఖ్యానించారు. అమరావతి వెళ్ళటానికే రాయలసీమ వాసులు చాలా ఇబ్బంది పడ్డారని అన్నారు. అన్ని ప్రాంతాలకు ఉద్యోగావకాశాలు కల్చించాలని డిమాండ్ చేశారు.అమరావతిని గతంలో ఫ్రీ జోన్ గా ఎందుకు ప్రకటించలేదన్నారు.
ఆయన మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ నుంచి బిజెపిలోకి వెళ్లిన టీ జీ వెంకటేష్ చాలా ముందుగా ఏపీలో నాలుగు రాజధానులు వస్తాయని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు వైజాగ్ కు సచివాలయాన్ని మార్చాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అందరికీ అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇవ్వకపోతే మళ్ళీ ఉద్యమాలు వస్తాయని అన్నారు.