Telugu Gateway
Cinema

శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం

శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం
X

వినూత్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా శుక్రవారం నాడు ప్రారంభం అయింది. ఈ హీరో తాజా చిత్రం ‘తిప్పరా మీసం’ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ ఆర్ట్స్‌ ఎల్‌ఎల్‌పీలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాతో హాసిత్‌ గోలి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. తన అభిమానులు తన నుంచి ఆశించే విభిన్నమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వివేక్‌ సాగర్‌ సంగీతమందిస్తున్న ఈ మూవీ సంబంధించి ఇతర నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.

Next Story
Share it