Telugu Gateway
Cinema

రాములో..రాములా ‘వంద మిలియన్ల’ రికార్డు

రాములో..రాములా ‘వంద మిలియన్ల’ రికార్డు
X

అల్లు అర్జున్ మరో రికార్డు సాధించాడు. ఇప్పటికే అల..వైకుంఠపురములో సినిమాకు సంబంధించిన ‘సామజవరగమన’ పాట వంద మిలియన్ల వ్యూస్ ను దాటేసింది. ఇప్పుడు తాజాగా రాములో..రాములా పాట కూడా అదే జాబితాలో చేరింది. అయితే ఇప్పటివరకూ ఏ తెలుగు పాట సాధించలేని ఘనతను ఇది దక్కించుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అత్యంత వేగంగా వంద మిలియన్ల వ్యూస్ సాధించిన తెలుగు పాటగా రాములో..రాములా నిలుస్తుందని తెలిపారు. అంటే ఏకంగా ఒకే సినిమాకు సంబంధించిన రెండు పాటలు వంద మిలియన్ల వ్యూస్ ను దాటేసి ముందుకెళుతున్నాయి. అల్లు అర్జున్, పూజా హెగ్డె జోడీగా నటిస్తున్న ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి రేసులో అంటే జనవరి 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=wFAj0pW6xX0

Next Story
Share it