Telugu Gateway
Cinema

హీరోయిన్ కాళ్ల మీద పడ్డ రామ్ గోపాల్ వర్మ

హీరోయిన్ కాళ్ల మీద పడ్డ రామ్ గోపాల్ వర్మ
X

రామ్ గోపాల్ వర్మ. సంచలనాలకు కేంద్ర బిందువు. ఆయన సినిమా ప్రకటించారు అంటే చాలు దాని చుట్టూ ఎన్నో వివాదాలు. వాద ప్రతివాదాలు. అవే ఆయన సినిమాకు విపరీతమైన క్రేజ్ ను, ప్రచారాన్ని తెచ్చిపెడతాయి. అలాగే వర్మ ప్రతి చర్య..ప్రతి మాటా సంచలనమే. అలా ఉంటాయి ఆయన మూమెంట్స్. తాజాగా వర్మ హీరోయిన్ కాళ్ల మీద పడి ఆయన పెద్ద సంచలనం సృషించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తన హీరోయిన్ తో కలసి డ్యాన్స్ చేసి..కొంత మంది తన డ్యాన్స్ ను ఫైట్ లా ఉందన్నారని తనను తానే విమర్శించుకున్నారు కూడా. ఆయన సమకూర్చిన కథతో తెరకెక్కిన సినిమానే ‘బ్యూటిఫుల్’.

ఈ సినిమా నూతన సంవత్సరం తొలి రోజు జనవరి 1న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నైనా గంగూలీ కాళ్ళ మీద పడిన వర్మ తాజాగా కలకలం రేపారు. ఇది చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. బ్యూటిఫుల్ సినిమాకు ట్రిబ్యూట్ టూ రంగీలా అంటూ పేర్కొన్నారు. బ్యూటిఫుల్ విడుదల సంద్భంగా చిత్ర యూనిట్ ఆదివారం రాత్రి ఓ పార్టీ నిర్వహించింది. అందులోనే వర్మ హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లమీద పడిపోయారు. ఈ ఘటనతో హీరోయిన్ నైనా కూడా తీవ్ర ఉధ్వేగానికి గురై...ఆయన్ను పట్టుకుని కన్నీళ్ళుపెట్టుకున్నారు.

Next Story
Share it