Telugu Gateway
Andhra Pradesh

సైనిక్ బోర్డుకు పవన్ కళ్యాణ్ కోటి విరాళం

సైనిక్ బోర్డుకు పవన్ కళ్యాణ్ కోటి విరాళం
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశంలోని సైనికుల కుటుంబాల సంక్షేమం చూసే కేంద్రీయ సైనిక్ బోర్డు (కె.ఎస్.బి.) కి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని తానే స్వయంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఢిల్లీ వెళ్ళి కోటి రూపాయల డీ డీని అందజేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సైన్యంలో పనిచేస్తూ అమరులైన వారి కుటుంబాల సంక్షేమం కోసం ఈ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డు పనిచేస్తోంది.భారత రక్షణ మంత్రి చైర్మన్ గా,ముఖ్యమంత్రులు,త్రివిధ దళాల అధిపతులు సభ్యులుగా ఈ బోర్డులో వున్నారు.అమర సైనిక వీరులను స్మరించుకోవడానికి ఏటా డిసెంబర్ 7వ తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవం ( ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ) ను సైనిక బోర్డు నిర్వహిస్తోంది.

ఈ పతాక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కు సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్ మృగేంద్ర కుమార్ బోర్డు కార్యకలాపాలను తెలుపుతూ ఒక లేఖ రాశారు. పతాక దినోత్సవం గురించి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం వీడియో రూపంలో పంపమని కోరారు.ఆ మేరకు వీడియోను రూపొందించి సైనిక్ బోర్డుకు పంపారు. మన ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టేస్తున్న సైనికుల కుటుంబాలకు కోసం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగాకోటి రూపాయలను విరాళంగా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు.

Next Story
Share it