Telugu Gateway
Top Stories

రెండు వేల నోట్ల రద్దు యోచన లేదు

రెండు వేల నోట్ల రద్దు యోచన లేదు
X

కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అసత్య ప్రచారాలకు చెక్ పెట్టింది. గత కొంత కాలంగా త్వరలోనే రెండు రూపాయల నోట్లు కూడా రద్దు అవుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి సర్కులేషన్ లో ఈ నోట్లు అతి తక్కువ ఉండటం ఒకెత్తు అయితే..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) కూడా ఈ నోట్ల రద్దును గణనీయంగా తగ్గించటం ఒకటి. ఈ తరుణంలో పార్లమెంట్ వేదికగా ఆర్ధిక మంత్రి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. రూ.2000 నోట్లను రద్దు చేస్తామని సాగుతున్న ప్రచారం అవాస్తవమని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు.

దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాబోయే రోజుల్లో రూ. 2000 నోటును ప్రభుత్వం ఉపసంహరిస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రూ. 2000 నోటును ప్రవేశపెట్టడంతో దేశంలో నల్లధనం పెరిగిపోయిందని, దాని స్ధానంలో ప్రభుత్వం తిరిగి రూ.1000 నోటును ప్రవేశపెడుతుందని ప్రజల్లో ఓ ప్రచారం సాగుతోందని ఎస్పీ సభ్యుడు విశ్వంభర్‌ ప్రసాద్‌ నిషద్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నల్లధనాన్ని నిర్మూలించి నకిలీ నోట్లను తొలగించేందుకే నోట్ల రద్దును ప్రభుత్వం చేపట్టిందని మంత్రి ఠాకూర్‌ చెప్పారు.

Next Story
Share it