Telugu Gateway
Andhra Pradesh

నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్

నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్
X

తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ. నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ కీలక నేత బీద మస్తాన్ రావు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి రాజీనామా లేఖను పంపారు. అందులో వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గత కొంత కాలంగా బీద సోదరులు టీడీపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లే బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు అధికార వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీద రవిచంద్ర కూడా అదే బాట పడతారా? లేక కొంత కాలం వేచి చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Next Story
Share it