Telugu Gateway
Cinema

హాకీ ప్లేయర్ గా లావణ్య త్రిపాఠి

హాకీ ప్లేయర్ గా లావణ్య త్రిపాఠి
X

చేసింది తక్కువ సినిమాల్లో అయినా లావణ్య త్రిపాఠి పలు చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ భామ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాలో సందడి చేయనుంది. ఆదివారం నాడు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హాకీ ప్లేయర్ ఫోజుతో కూడిన లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు.

హాకీ ప్లేయర్ పాత్రలో నిజమైన క్రీడాకారిణిగా కన్పించేందుకు ఆమె హాకీలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే నిఖిల్‌, లావణ్య హీరోహీరోయిన్‌లుగా నటించిన ‘అర్జున్‌ సురవరం’ బ్లాకబస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Next Story
Share it