Telugu Gateway
Andhra Pradesh

వైసీపీవి చేతకాని మాటలు

వైసీపీవి చేతకాని మాటలు
X

బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. చేతకాని మాటలు మాట్లాడుతున్నారని..అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే..అక్రమాలు జరిగితే ఆరు నెలల నుంచి ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని అన్నారు. పోలవరంలో 3000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేల్చారు..కానీ చర్యలు లేవు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఎవడు అడ్డుపడుతున్నాడు..లేక మీరు మీరు రాజీపడ్డారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ శనివారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని...తాము అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు ఇస్తామే కానీ..రాజధాని వికేంద్రీకరణకు కాదని స్పష్టం చేశారు. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారతాయా? అని ప్రశ్నించారు. జీ ఎన్ రావు కమిటీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

గతంలో చంద్రబాబునాయుడు నియంతృత్వంతో వ్యవహరించారని..ఇఫ్పుడు జగన్ కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 151 సీట్లు ఉన్నా కూడా జగన్ ఎందుకో అభద్రతా భావంలో ఉన్నారని కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరు నెలల్లో రాష్ట్రానికి పనికొచ్చే పని ఒకటి చేశారా? అని ప్రశ్నించారు. జగన్ ఏపీని అభివృద్ధి చేస్తారని ఎవరికీ నమ్మకంలేదన్నారు. రాజధాని మార్పు రాష్ట్రానికి మంచిదికాదని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు మంచిదికాదన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే సహించేదిలేదన్నారు. కేంద్రం ఇఫ్పటికే రాజధాని కోసం 2500 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పిచ్చి నిర్ణయాలకు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని అన్నారు.

Next Story
Share it