Telugu Gateway
Andhra Pradesh

అమరావతికి జనసేన కమిటీ

అమరావతికి జనసేన కమిటీ
X

ఏపీ నూతన రాజధాని అమరావతి అంశంలో నెలకొన్న వివాదంపై జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సారధ్యంలో ఈ కమిటీ పర్యటించనుంది. ఇందులో పీఏసీ కమిటీ సభ్యులు, పార్టీ నేతలు కూడా ఉంటారు. రాజధాని గ్రామాలలో నాదెండ్ల సారధ్యంలోని కమిటీ శుక్రవారం నాడు పర్యటించనుంది.

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనల గురించి ఈ కమిటీ తెలుసుకోనుంది. ఆ ప్రాంత ప్రజలకు జనసేన ఎప్పుడూ భరోసాగా నిలుస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చేవరకూ అనుసరించాల్సిన కార్యాచరణను ఈ బృందం రైతులతో చర్చిస్తుందని తెలిపారు.

Next Story
Share it