Telugu Gateway
Andhra Pradesh

‘జగనన్న ఉల్లి పథకం’ అని పెట్టుకోండి..వాళ్ళతో సరఫరా చేయించండి

‘జగనన్న ఉల్లి పథకం’ అని పెట్టుకోండి..వాళ్ళతో సరఫరా చేయించండి
X

గ్రామ వాలంటీర్లతో ఎందుకు ఉల్లిపాయలు సరఫరా చేయించరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజలు ఉల్లిపాయల కోసం రోజూ గంటల తరబడి క్యూలో నిలుచోవాల్సి వస్తుందని..ఈ ఇబ్బంది తప్పించాలంటే కిలో 25 రూపాయలకే ఉల్లిపాయలను గ్రామ వాలంటీర్లతో ప్రతి ఇంటికి ఎందుకు అందివ్వరు అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కావాలంటే ఈ స్కీమ్ కు ‘జగనన్న ఉల్లిపాయల పథకం’ అని పేరు పెట్టుకోవాలని సూచించారు.

అంతకుముందు మరో ట్వీట్ లో నిత్యావసరాల ధరలను తగ్గించటంతో వైసీపీ ప్రభుత్వం విపలమైందన్నారు. ఉల్లిపాయల కోసం భారీ ఎత్తున క్యూకట్టిన ప్రజల ఫోటోలు, వీడియోలను ఆయన షేర్ చేశారు. ప్రభుత్వ వైపల్యాన్ని ఇవి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. పేద ప్రజలను క్యూలో నిలుచోపెట్టి చంపే కేంట గ్రామ వాలంటీర్ల ద్వారా అయినా సరఫరా చేయాలని సూచించారు.

Next Story
Share it