Telugu Gateway
Cinema

డాంగ్ డాంగ్ లో మహేష్ బాబూ ‘కుమ్మేశాడు’

డాంగ్ డాంగ్ లో మహేష్ బాబూ ‘కుమ్మేశాడు’
X

నిజంగా మహేష్ బాబు కూడా కుమ్మేశాడు. తమన్నాతో కలసి డ్యాన్స్ ఇరగదీశాడు. ఇప్పటివరకూ చూసిన మహేష్ బాబు డ్యాన్స్ లు వేరు..తాజాగా విడుదలైన ‘డాంగ్ డాంగ్ ’ పాటలో మహేష్ బాబు డ్యాన్స్ వేరు. మిల్కీ బ్యూటీ తమన్నాతో కలసి చాలా వేగంగా స్టెప్పులు వేశాడు. ఇది చూసిన మహేష్ బాబు అభిమానులు ఫుల్ కుషీకుషీగా ఉన్నారు. మహేష్ బాబు ఇతర టాలీవుడ్ హీరోలతో పోలిస్తే డ్యాన్స్ లో వీక్. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పార్టీ సాంగ్ లో తమన్నాతో కలసి ఈ సూపర్ స్టార్ దుమ్మురేపాడు. తమన్నాతో కలసి వేగమైన స్టెప్పులతో అలరించాడు. సహజంగా తమన్నా కదలికలు చాలా వేగంగానే ఉంటాయి.

మహేష్ బాబు కూడా ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ సినిమాలో కన్పించబోతున్నాడు. అయితే ఈ డాంగ్ డాంగ్ పాట ఐటెం సాంగ్ కాదని..పార్టీ సాంగ్ అని చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘హెల్లో..వెలకం టూ 2020 విత్ బ్యాంగ్. అజ్ రాత్ మేరే గర్ మే పార్టీ హై. తూ ఆజానా..డాంగ్ డాంగ్ ’ అంటూ మొదలయ్యే పాట ఫుల్ జోష్ లో సాగుతుంది. ఈ పాట ప్రొమోను శనివరం నాడు విడుదల చేశారు. పూర్తి పాట సోమవారం నాడు రానుంది. మహేష్ బాబు, రష్మికలు నటిస్తున్న ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=pCj2K2Kc7BE

Next Story
Share it