Telugu Gateway
Cinema

అదరగొడుతున్న ‘డాంగ్ డాంగ్’ సాంగ్

అదరగొడుతున్న ‘డాంగ్ డాంగ్’ సాంగ్
X

మహేష్ బాబు, తమన్నా అదరగొట్టారు. ఓ పార్టీ సాంగ్ లో కుమ్మేశారు. మహేష్ బాబు కూడా గతానికి భిన్నంగా స్పీడ్ స్టెప్పులతో దుమ్మురేపాడు. సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ సోమవారం నాడు ఈ పార్టీ సాంగ్ కు చెందిన పూర్తి పాటను విడుదల చేసింది. ఇది చూసిన మహేష్ బాబు అభిమానులు కుషీకుషీ. ఈ పాట సినిమాపై జోష్ పెంచిందనే చెప్పాలి. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘డీజే దించుతాం.. సౌండ్‌ పెంచుతాం’, ‘లెట్స్‌ పార్టీ విత్‌ దిస్‌ సాంగ్‌.. గుర్తుండిపోవాలి లైఫ్‌ లాంగ్‌’, ‘వాటే స్కిన్‌ టోను.. నచ్చావే గ్లామర్‌ క్వీన్.. నిన్ను చూసి దిల్‌ మె గిర్రుమంది రొమాంటిక్‌ టోను’, ‘నువ్వు పక్కనున్న కిక్కు చాలు అదే చంద్రయాను’ అంటూ పాటలో వచ్చే లిరిక్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ పాటతో సంగీత అభిమానులు ఉర్రూతలూగుతున్నారు.

https://www.youtube.com/watch?v=tKRoo2IRD-U

Next Story
Share it