Telugu Gateway
Cinema

అల..వైకుంఠపురములో టీజర్ వచ్చేసింది

అల..వైకుంఠపురములో టీజర్ వచ్చేసింది
X

‘మీ నాన్న పెళ్ళి కూతురుని దాచినట్లు దాచాడు. సరిగ్గా చూడలేదు ఎప్పుడూ. ముందుకు రా’ అని పిలవటంతో బోర్డు సమావేశం రూమ్ లో టేబుల్ ఎక్కి మరీ స్టైల్ గా ముందుకు దూసుకొస్తాడు అల్లు అర్జున్. గట్టొడివి అని విలన్ ప్రశంసించటం. ఆ తర్వాత ఓ ఫైట్ సీన్..స్టైల్ గా ఉంది కదా? నాక్కూడా నచ్చింది’ అంటూ అల్లు అర్జున్ డైలాగ్. ఇవీ అల..వైకుంఠపురములో సినిమాకు సంబంధించిన టీజర్ లో తొలి సన్నివేశాలు. మధ్యలో హీరోయిన్ పూజా హెగ్డె ఎంట్రీ. మేడమ్ సర్...మేడమ్ అంతే అంటూ కామెంట్. సమ్ థింగ్ కంప్లీట్ అవటం లేదంటూ సుశాంత్ అంటే..ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక డైలాగ్ లేదనా?.

‘ మీరిప్పుడే కారు దిగారు..నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కాను’ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ తో టీజర్ క్లోజ్ అవుతుంది. కొడవలి ఓ ఇనుప రాడ్ కు గీసి సిగరేట్ వెలిగించుకోవటంతో ఇది ముగుస్తుంది. పాటల తరహాలోనే అల..వైకుంఠపురములో టీజర్ కూడా పవర్ ప్యాక్డ్ గా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=rvzWljqIRyU&feature=emb_logo

Next Story
Share it