ఎన్నాళ్లకో..ఎన్నేళ్ళకో అంటున్న ‘వెంకీమామ’
BY Telugu Gateway16 Nov 2019 12:57 PM IST
X
Telugu Gateway16 Nov 2019 12:57 PM IST
‘ఎన్నాళ్ళకో..ఎన్నేళ్ళకో ఒంటికాయ సొంఠికొమ్ము సెంటు పట్టెరో ..ఏ ఊహలు లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకేసరో’ అంటూ విక్టర్ వెంకటేష్ సందడి చేశారు. ‘వెంకీ మామ’ సినిమాకు సంబంధించిన రెండవ పాటను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది.
ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, వెంకటేష్ లు నటిస్తుండగా..వీరిద్దరికి జోడీలుగా రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు నటిస్తున్నారు. వెంకటేష్, పాయల్ లతో చిత్రీకరించిన ఈ పాట సరదా సరదాగా సాగుతుంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 1980 కాలం నాటి స్టైల్ ను తలపించేలా ఈ పాటను తెరకెక్కించారు.
https://www.youtube.com/watch?v=PKJ4LkUpElQ
Next Story