Telugu Gateway
Politics

సుస్ధిర సర్కారు కోసమే..ఫడ్నవీస్

సుస్ధిర సర్కారు కోసమే..ఫడ్నవీస్
X

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రకు కిచిడీ సర్కారు కాదు..సుస్ధిరమైన సర్కారు కావాలని ఆయన వ్యాఖ్యనించారు.. తాము సుస్థిర ప్రభుత్వం ఇవ్వగలమని పేర్కొన్నారు. తమకు పూర్తి మెజారిటీ ఉందని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి మెజారిటీ ఇచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన మాట తప్పిందని ఆరోపించారు. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన ప్రయత్నించడంతోనే రాష్ట్రపతి పాలన వచ్చిందన్నారు. ఎన్సీపీతో కలిసి సుస్థిర పాలన అందిస్తామని తెలిపారు.

సుస్థిర పాలన ఏర్పాటుకు తమతో కలిసి వచ్చిన అజిత్‌ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తెలిపారు. ‘ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. రైతులతో సహా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. ప్రభుత్వం ఏర్పాటైతేనే ఈ సమస్యలు తొందరగా పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతో బీజేపీతో చేతులు కలిపామ’ని అజిత్‌ పవార్‌ వివరించారు.

Next Story
Share it