Telugu Gateway
Cinema

అదరగొడుతున్న ‘తిప్పరామీసం’ ట్రైలర్

అదరగొడుతున్న ‘తిప్పరామీసం’ ట్రైలర్
X

శ్రీవిష్ణు. విభిన్న చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు. ఇటీవలే శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘బ్రోచెవారెవరురా’ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ‘తిప్పరామీసం’ అంటూ ముందుకొస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ అదరగొడుతుందనే చెప్పాలి. ఇందులో శ్రీవిష్ణు డైలాగ్ లు..యాక్షన్ సూపర్ అనేలా ఉన్నాయి. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ లభించింది.

‘నా గతాన్ని.. నా సమస్యను గుర్తించని ఈ పనికిమాలిన సమాజం, నేను చేసింది తప్పు అని ఓ ముద్ర వేసింది’, ‘వాడికున్న కోపమంతా వాడి అమ్మమీదే’ ,‘కన్న తల్లిని రోడ్డుకీడ్చిన కొడుకుగా చరిత్రలో నిలిచిపోతావ్‌’, ‘ నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’, ‘అందరూ నేను అర్థం కాని వెదవనని అనుకుంటారు. కానీ ఎవడేమనుకుంటే నాకేంటి.. నేననుకున్నదే చేస్తా’ అంటూ ట్రైలర్‌లో శ్రీవిష్ణు చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి ‘అసుర’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవిష్ణు సరసన నిక్కి తంబోలి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

.

https://www.youtube.com/watch?time_continue=72&v=G2ji7OPNMW8

Next Story
Share it