Telugu Gateway
Top Stories

టెలికం కంపెనీలకు రెండేళ్ళ ఊరట

టెలికం కంపెనీలకు రెండేళ్ళ ఊరట
X

స్థూల ఆదాయం లెక్కల దెబ్బకు తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన దేశీయ కంపెనీలకు ఒకింత ఊరట లభించింది. మరి ఈ ఊరటతో టెలికం కంపెనీలు ఛార్జీల పెంపును వాయిదా వేస్తాయా? లేక ముందు ప్రకటించినట్లుగానే డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలను అమలు చేస్తాయా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది.

కేంద్ర తాజా నిర్ణయంతో భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it