సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు..గంటానే కాదు అందరూ వస్తారు
ఏపీ బిజెపి ఎమ్మెల్సీ, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీలో టీడీపీ ఖాళీ కాబోతుందని ప్రకటించారు. అతి తొందరలోనే టిడిపి ఖాళీ కావడం ఖాయం అని పేర్కొన్నారు. ఆ 23 మందిని కలుపుకుంటామని ప్రకటించారు. ఈ శాసన సభ లో బిజిపి ప్రాతినిధ్యం ఉండటం ఖాయమన్నారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా తనను కలిశారని చెప్పారు. ఇద్దరు రాజకీయ నేతలు కలిస్తే ఏమి చర్చ కు వస్తాయో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు.
త్వరలోనే చాలామంది నేతలు బిజెపి వస్తారు. రాష్ట్రం లో చంద్రబాబు మాటలు నమ్మరన్నారు. గత కొంత కాలంగా టీడీపీ నేతలను బిజెపి టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బిజెపిలోకి వెళ్ళారు. గంటా శ్రీనివాసరావు కూడా ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు అందరినీ కలిసొచ్చారు. ఈ తరుణంలో సోము వీర్రాజు ఏకంగా టీడీపీ ఖాళీ అవుతుందని ప్రకటించటం రాజకీయంగా సంచలనంగా మారింది. ఎప్పటి నుంచో ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.