సంపూర్ణేష్ బాబు కారును గుద్దిన ఆర్టీసీ బస్సు
BY Telugu Gateway27 Nov 2019 1:42 PM IST
X
Telugu Gateway27 Nov 2019 1:42 PM IST
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు ఆగటం లేదు. మంగళవారం నాడు హైదరాబాద్ లో ఓ ఆర్టీసీ బస్సు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతికి కారణమైన విషయం తెలిసిందే. బుధవారం నాడు సిద్ధిపేట సమీపంలో సంపూర్ణేష్ కారు ప్రమాదానికి గురైంది. దీనికి కారణం ఆర్టీసీ బస్సే. తాత్కాలిక డ్రైవర్లు పలు చోట్ల ప్రమాదాలకు కారణం అవుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. అయితే అదృష్టవశాత్తూ సంపూర్ణేష్ బాబు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు.
తన భార్య, పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా, ఆర్టీసీ బస్సు ఆయన కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్, ఆయన భార్య, కూతురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకొని సంపూర్ణేష్ బాబు ఫ్యామిలీని ఆసుపత్రికి తరలించారు.
Next Story