Telugu Gateway
Telangana

ఆర్టీసీ కార్మికులు ఎక్కడికి అక్కడే అరెస్ట్

ఆర్టీసీ కార్మికులు ఎక్కడికి అక్కడే అరెస్ట్
X

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ లు కొనసాగుతున్నాయ. హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో సర్కారు భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. జెఏసీ పిలుపు మేరకు విధుల్లో చేరేందుకు మంగళవారం ఉదయమే ఆర్టీసీ కార్మికులు డిపోల వద్దకు చేరుకుంటుండగా..వాళ్లందరినీ పోలీలసు అరెస్ట్ చేసి అక్కడ నుంచి తీసుకెళుతున్నారు. అన్ని డిపోల దగ్గర ఇదే తంతు. పోలీసులు 144 సెక్షన్ విధించి కార్మికులు గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. పలు చోట్ల పోలీసులు..కార్మికుల మధ్య ఘర్షణలు, తోపులాటలు జరుగుతున్నాయి. 52 రోజుల సమ్మె తర్వాత విధుల్లో చేరతామని జెఏసీ నేతలు ప్రకటించారు.

మంగళవారం నుంచి తాత్కాలిక సిబ్బంది ఎవరూ విధులకు రావొద్దని జెఏసీ నేతలు కోరారు. కానీ తాత్కాలిక సిబ్బందితో యాజమాన్యం ఆర్టీసీ బస్సులు నడిపిస్తోంది. ఆర్టీసీ యాజమాన్య వైఖరిపై జెఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణాలతో విధుల్లో చేర్చుకోవటంలేదో లిఖితపూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. విధుల్లో చేరటానికి వచ్చిన వారిని అడ్డుకోవటంతో మహిళ కండక్టర్లు కంటతడి పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం నాడు ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండె పోటుతో మరణించారు.

Next Story
Share it