Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ హీరోయిన్ వచ్చేసింది

ఎన్టీఆర్ హీరోయిన్ వచ్చేసింది
X

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించి కీలక ప్రకటన వచ్చేసింది. ఎన్టీఆర్ సరసన నటించే భామ ఎవరో తెలిసిపోయింది. ఇంత కాలం ఎవరెవరా అంటూ ఆరా తీసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది ఓ గుడ్ న్యూస్. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి 'ఒలివియా మోరిస్' నటిస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఆమె పాత్ర పేరు జెన్నీఫర్. క్యూట్ లుక్స్ తో ఉన్న ఈ విదేశీ భామ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుంటే..మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ అలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని కూడా చిత్ర బృందం ప్రకటించింది. 'రే స్టీవన్ సన్' ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. 'ది థీరీ ఆఫ్ ఫ్లైట్' ద్వారా ఈ నటుడు సినిమాల్లో అరంగేట్రం చేశాడు. రే స్టీవన్ సన్' తో పాటు మరో కీలక పాత్రలో అలీ సెన్ డూడీ నటిస్తుంది. 'జేమ్స్ బాండ్' సినిమాలో చిన్న క్యారెక్టర్ లో తళుక్కుమని మెరిసింది ఈ అమ్మడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ 70 శాతం మేర పూర్తయిందని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it